నిరుద్యొగులకు గుడ్ న్యూస్..ఆ జిల్లాల్లో జాబ్ మేళా..

-

నిరుద్యొగులకు ఏపీ సర్కార్ తీపి కబురును అందించింది..రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు.ఈ మేరకు ప్రముఖ యూనివర్సిటీలలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు.గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మూడో జాబ్ మేళా నిర్వహింస్తున్నామని ప్రకటించారు.అంతేకాదు.. తిరుపతి, విశాఖ జాబ్ మేళాలో 30,407 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. నాగార్జున వర్సిటీ జాబ్ మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 97 వేల మంది నిరుద్యోగులు ఇప్పటికే రిజిష్ట్రేషన్ చేసుకున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

టాప్ కంపెనీలలో 26,289 ఖాళీలు ఉన్నాయని అన్నారు. వాటిని ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నారని ఆయన అన్నారు.ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, కనస్ట్రక్షన్స్ కంపెనీలు జాబ్ మేళాలో ఇంటర్వ్యూ చెయనున్నాయని అన్నారు.నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా యూనివర్సిటీ ముందు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రతి బ్లాక్ లో రిసెప్షన్ ఉంటుందని, ఉచితంగా ఆహారం, మంచినీరు అభ్యర్థులకు అందిస్తామన్నారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ ద్వారా 800 మందికి సహకారం అందిస్తున్నామని తెలిపారు.

ఈ మేళా లో ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు.ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7, 8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. దాదాపు 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి.ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇంటర్వ్యూ లో పాల్గొనవచ్చు.. ఇది నిరుద్యొగులకు సువర్ణావకాశం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version