సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి శుభవార్త.. స్పెషల్ రైళ్లు ప్రకటన

-

సంక్రాంతి పండుగకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పటి నుంచే ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే, సంక్రాంతి సొంత ఊరికి వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

ఈ సారి పండుగ రద్దీ ఉంటుందని అంచనాలతో 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్ ఉండడంతో, దీనికి తగ్గట్లుగా రైళ్ళను నడపనుంది. 2023 జనవరి 1 నుంచి 20 వరకు ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాలకు ఇది నడుస్తున్నాయని తెలిపారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version