కోవిడ్ టీకా వేసుకున్న వారికి శుభవార్త.. ఆ బ్యాంకు ఎఫ్‌డీపై ఎక్కువ వడ్డీ పొందొచ్చు..!

-

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు టీకా వేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్ టీకా వేసుకోవడానికి ప్రోత్సహక ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీం ద్వారా బ్యాంకు వినియోగదారులు టీకా వేసుకున్నట్లయితే వారి ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఖాతాపై 0.25 శాతం అదనపు వడ్డీ పొందొచ్చు. ఈ స్కీం 1,111 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ కొత్త స్కీం పేరు ‘ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీం’.

Central-Bank-of-india

పరిమితి కాల పథకాన్ని బ్యాంకు కస్టమర్లు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ స్కీంలో సీనియర్ సిటిజన్లు కూడా అర్హులుగా పరిగణించబడతారన్నారు. అయితే ఈ స్కీం అనేది మొదటి వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా వర్తింపజేయడం జరుగుతుందన్నారు. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీం అనేది కేవలం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు మాత్రమే కేటాయించారు. బ్యాంకు తన కస్టమర్లకు కోవిడ్ సోకినప్పుడు ప్రోత్సాహకంగా ఈ స్కీంను ప్రవేశపెట్టింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ పథకం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,111 రోజుల పాటు హెల్తీ సొసైటీ నిర్మించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకంలో కోవిడ్ టీకాలు వేసుకున్న వ్యక్తి స్థిర డిపాజిట్లపై 0.25 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడేళ్ల డిపాజిట్లపై 5.1 శాతం వడ్డీ కల్పిస్తుండగా.. ఈ స్కీంలో చేరిన వారికి 5.35 శాతం రాబడి అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లు కూడా అదనపు వడ్డీ స్కీంకు అర్హులని బ్యాంకు తెలిపింది. టీకా డోస్ తీసుకున్న సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.50 శాతం అదనపు వడ్డీ కల్పిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version