పిల్లలు ఉన్నవాళ్ళకి గుడ్ న్యూస్.. చేతికి రూ.28 లక్షలు.. ఇంత కడితే సరిపోతుంది..!

-

చాలా మంది భవిష్యత్తు లో ఏ సమస్యలు ఉండకూడదని పలు పాలసీని తీసుకుంటారు. స్కీమ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో సేవలని అందిస్తోంది. కొత్త కొత్త ప్లాన్లు కూడా తీసుకొస్తోంది.

ఎండో మెంట్, మనీ బ్యాక్, లైఫ్, యాన్యుటీ వంటివి తీసుకు వస్తూ ఉంటుంది. వాటిలో ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్ ఒకటి. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుపై దీన్ని తీసుకుంటారు. ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు మనీ బ్యాక్ కూడా దీనిలో వుంది. భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు, పిల్లల చదువుల కోసం బెస్ట్ ఇది.

నాన్ లింక్డ్ ప్లాన్ ఏ. దీనిలో పాలసీ టెన్యూర్ కంటే ఐదేళ్లు తక్కువే ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. కనీస వయసు 90 రోజులు. గరిష్ఠంగా 12 ఏళ్ల వయసు పిల్లల పేరుపై దీన్ని తీసుకోవచ్చు. కనీసం రూ. 75 వేల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి వుంది. గరిష్ఠ పరిమితి లేదు. మెచ్యూరిటీ సమయం 25 ఏళ్లు.
20 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కట్టడం ఆపేసిన తరవాత కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది వయసు లోపే పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 24 ఏళ్లు.

అంటే మీరు 19 ఏళ్ల పాటు ప్రీమియం పే చేయాలి. రూ. 10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలవారీ ప్రీమియం రూ. 3832 అవుతుంది. రోజుకు రూ.130 చెల్లిస్తే సరిపోతుంది. 2 ఏళ్లప్పుడు మీరు పాలసీ తీసుకుంటే… పిల్లకి 23 ఏళ్ల వయసు వరకు పాలసీ వర్తిస్తుంది. మీరు 18 ఏళ్ల పాటు ప్రీమియం పే చేయాలి. రూ. 10 లక్షలకు పాలసీ తీసుకుంటే.. రోజుకు రూ. 171 ప్రీమియం కట్టాలో. ఇలా రూ. 10, 89,196 కడతారు. దీంతో మెచ్యూరిటీ తర్వాత పిల్లకి 25 ఏళ్లు వచ్చే సరికి రూ. 28.24 లక్షలు ని మీరు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version