దిల్లీలో జీ-20 సదస్సు.. ఏ దేశాధినేతలు వస్తున్నారు.. రానివారెవరు..?

-

దిల్లీలో ఈనెల 9, 10వ తేదీల్లో జీ-20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అనేక కీలక దేశాల అధినేతలు హాజరుకాబోతున్నారు. 20 కీలక ఆర్థిక దేశాల ఈ కూటమిలోంచి ఎవరెవరు వస్తున్నారో.. ఎవరు రావట్లేదో చూస్తే..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిల్లీ సదస్సుకు ఈ నెల ఏడో తేదీనే వస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌ తొలిసారి దిల్లీ రానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ జీ-20పై ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు. భారత్‌తో పాటు ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ల్లోనూ ఆయన పర్యటించనున్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద ఇప్పటికే దిల్లీ వస్తున్నట్లు సమాచారమిచ్చారు.

దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌యోల్‌.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌.. చైనా ప్రధాని లీ చియాంగ్‌ సారథ్యంలోని బృందం.. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, టర్కీ, అర్జెంటీనా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల అధ్యక్షుడు దిల్లీ సదస్సుకు హాజరవుతారని సమాచారం. మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధంతో తలమునకలవుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జీ-20 సదస్సుకు హాజరు కావటం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version