మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ HPCL (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు.
గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. సెలెక్ట్ అయినవారు మార్కెటింగ్ విభాగంలో పని చేయాల్సి వుంది. నేషనల్ అప్రంటీస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని అప్రూవల్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ అవకాశం. 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ని పూర్తి చేసిన వారు అర్హులు.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. ఇక వయస్సు విషయానికి వస్తే.. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారు అప్లై చేసుకోచ్చు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, PwD అభ్యర్థులకు పదేళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. ఇక ఎలా అప్లై చేయాలి అనేది చూస్తే..
ముందుగా NATS పోర్టల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి.
నెక్స్ట్ USER lD/Email lD ఐడీ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
‘‘ESTABLISHMENT REQUESTS’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తార్వాత ‘‘Find Establihment’’ ను ఎంచుకోవాలి.
తర్వాత Establishment Name ఆప్షన్ ను ఎంచుకుని ‘‘Hindustan Petroleum Corporation Limited’’ ను నైప్ చేసి Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు దానిని సెలక్ట్ చేసి ‘‘Apply’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మెసేజ్ వస్తుంది ప్రాసెస్ కంప్లీట్ అయ్యినట్టే.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.