బీటెక్ చేసిన వారికి అడిపోయే గుడ్ న్యూస్.. ఆ శాఖలో భారీగా ఉగ్యోగాలు..

-

దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. కాగా, కొన్ని ఉద్యోగాలకు సంబందించిన పరీక్షలు కూడా పూర్తయిన విషయం తెలిసిందే.. తాజాగా మరో శాఖ లో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఈ మేరకు కంపెనీలో ఉన్న పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. BEL యొక్క ఘజియాబాద్ యూనిట్ కోసం ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bel-india.in లో అప్లై చేసుకోవాలి..

పూర్తి వివరాలు..

మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 12 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు, 26 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి..

అర్హతలు :

బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్ననారు. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు జనవరి 1, 2023 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు.. ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి.. వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను ఒకటికి పదిసార్లు చదివి అప్లై చేసుకోగలరు.. పైన తెలిపిన లింక్ లో పూర్తి వివరాలను తెలుసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవాలి.. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగాల భర్తీ కూడా పెరినట్లు తెలుస్తుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version