విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రేపటి నుంచి వారికి సైతం మధ్యాహ్న భోజనం

-

ఏపీ ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల స్థాయి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం ప్రారంభం (1వ జనవరి 2025) నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది.

దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన పేదరికంలో ఉన్న విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపింది. 475 జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి దీనిని ప్రారంభించాలంటూ రూ.115 కోట్లు కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news