ఒకేసారి రెండు శుభవార్తలని తీసుకు వచ్చిన బ్యాంక్..!

-

బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. వడ్డీ రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉంటున్నాయి. ఇంకో బ్యాంక్ కూడా ఫిక్సెడ్ డిపాజిట్స్ ని పెంచేసింది. సేవింగ్స్ ఖాతాలపై కూడా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా ఎఫ్‌డీ రేట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ ని పెంచేసింది. నవంబర్ 15 నుంచి రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందట. దీనితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.5 శాతంవరకు వడ్డీ వస్తుంది. సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం దాకా వడ్డీ వస్తుంది. ఇక వడ్డీ వివరాలను చూస్తే 7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ వస్తుందట. 15 నుంచి 60 రోజుల కి 6.6 శాతం, 91 నుంచి 180 రోజుల ఎఫ్‌డీలపై 7.05 శాతం వడ్డీ వస్తుంది.

181 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై 7.2 శాతం వస్తుంది. ఏడాది నుంచి రెండేళ్ల కి 8.35 శాతం వడ్డీ, రెండేళ్ల నుంచి మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.35 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7.45 శాతం, ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7.35 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 6.1 శాతం వడ్డీ వస్తుంది. క్యాలబుల్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ వస్తుంది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 4.5 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు బ్యాలెన్స్ ఏడు శాతం వడ్డీ ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version