గుడ్ న్యూస్.. భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌ లో మొత్తం 80 అప్రెంటిస్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి.

jobs

ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులని కోరుతున్నారు. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌, సివిలి ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుండి డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ప్యాస్ అయ్యి ఉండాలి.

ఇదిలా ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నవంబర్ 21, 2022వ తేదీ వరకు అవకాశం వుంది. అప్పటి లోగా పంపచ్చు. ఇక ఎలా ఎంపిక చేస్తారనేది నోటిఫికేషన్ లో వుంది. స్టైపెండ్ వివరాలు కూడా అందులో వున్నాయి చూడండి. పూర్తి వివరాలను https://www.bemlindia.in/ లో చూడచ్చు.

చిరునామా: AGM (Training), BEML Limited, Bangalore Complex, New Thippasandra post, Bangalore-560075.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version