ఆ హీరో పై మనసు పారేసుకున్న విష్ణు ప్రియ..నలిపేస్తానంటూ ..!

-

ఒకప్పుడు యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఆ తర్వాత సినిమాలలో కూడా నటిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్ లో చేయడమే కాకుండా బికినీ షోలు కూడా చేసి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఇకపోతే జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ తో కలిసి ” పోవే పోరా” అనే షో కి హోస్ట్ గా చేసిన ఆ తర్వాత ఆఫర్లు బాగా అందుకుంది. ఇకపోతే విష్ణు ప్రియ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ తన కెరియర్ను సక్సెస్ వైపు తీసుకెళ్తోంది.

ఇకపోతే ఈమెకు సినిమాలలో అవకాశాలు రావడంతో బుల్లితెరపై వచ్చే షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే కొన్ని షోలు , స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణు ప్రియ గెస్ట్ గా వస్తుంది. అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న “లేడీస్ అండ్ జెంటిల్మెన్” అనే షో కి సీరియల్ నటుడు మానస్ తో కలిసి వచ్చింది. ప్రముఖ మేల్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు.

ఇకపోతే గతవారం జరిగిన ” లేడీస్ అండ్ జెంటిల్మెన్” షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తనదైన అల్లరితో సందడి చేసింది.ఈ క్రమంలోనే ఈ షో హోస్ట్ ప్రదీప్ ఆమెను.. “విష్ణు ప్రియ.. నీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించాడు. దీనికి “అఖిల్ అక్కినేని అంటే నాకు ఇష్టం ” అంటూ ఒక్కసారిగా షాకింగ్ కామెంట్లు చేసింది. అంతేకాదు “అఖిల్ అక్కినేని మీద నాకు అదే ఉంది. అతడిని చూస్తే నలిపేయాలనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ సైగలు చేస్తూ తెగ సిగ్గు పడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version