గుడ్ న్యూస్.. మహిళల కోసం వాట్సాప్ లో న్యూ ఫీచర్..

-

మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం ఈ యాప్ వినియోగం ఎక్కువగానే ఉంది. వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడం కోసం ఇది సులువుగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం వాట్సాప్ తో కనెక్ట్ అయ్యి ఉంటారు.వినియోగదారుల సమాచారం చోరీకి గురవ్వకుండా ఉండేందుకు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇప్పటికే ఎన్నో యాప్ లను అందించిన వాట్సాప్ ఇప్పుడు మహిళల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సమాచార మార్పిడి నుంచి ఆన్‌లైన్ పేమెంట్, షాపింగ్‌, బ్యాంకింగ్‌, మెడికల్‌ రంగాలకు సంబంధించిన సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ సంస్థలు కూడా చాట్‌బాట్‌ సహాయంతో వాట్సాప్‌ యూజర్లకు సేవలందిస్తున్నాయి. మహిళలు తమ నెలసరి ని సులువుగా ట్రాక్‌ చేసేందుకు వీలుగా సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి వాట్సాప్‌ ఈ సేవలను ప్రారంభించింది. భారత దేశంలో తొలిసారిగా వాట్సాప్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది..

వాట్సాప్‌ ద్వారా ఈ చాట్‌బాట్‌ నెలసరి ట్రాకింగ్‌, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి మూడు రకాల సేవలను మహిళలకు అందిస్తోంది. ఈ సేవలను పొందేందుకు గాను మహిళలు ముందుగా తమ నెలసరికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన సమాచారాన్ని చాట్‌బోట్‌ రికార్డు చేసి కచ్చితమైన నెలసరి తేదీని యూజర్‌కు తెలియజేస్తుంది.

అయితే ముందుగా యూజర్లు +919718866644 అనే నంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ చేయాలి. తర్వాత చాట్‌బోట్ చూపించే మూడు ఆప్షన్లలో పిరియడ్‌ ట్రాకర్‌ అన్నదానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత నెలసరికి సంబంధించిన ప్రాథమిక వివరాలు నమోదు చేసి ఈ సేవలను పొందవచ్చు. మన రోజువారీ జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్‌ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్ ను తీసుకొని వచ్చినట్లు అధికారులు తెలిపారు.. ఇది మహిళలకు ఉపయోగపరంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version