ఏపీలో విద్యుత్ బిల్లుల విషయంలో గుడ్ న్యూస్…!

-

ప్రజలు నరకం చూస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సరే జనం మాత్రం తిండికి ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలోనే విద్యుత్ బిల్లుల విషయంలో పలు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ దృష్ట్యా ఏపీఎస్పీడీసీఎల్‌(విద్యుత్ సంస్థ) మార్చి నెల విద్యుత్‌ వినియోగానికి సంబంధించి వచ్చిన బిల్లునే ఏప్రిల్‌ బిల్లుకూ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు పంపనున్నట్లు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ పేర్కొంది.

ఈనెల 18 వరకు అపరాధ రుసుము లేకుండా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ మార్పును ఎనిమిది జిల్లాల ప్రజలు గమనించాలని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలు సంస్థలు విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజలకు ఊరట కలిగించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version