14 వారాలకే బిడ్డ చనిపోయినప్పటికీ… అప్పటికే బిడ్డకు కాళ్లు, చేతులు అన్నీ పెరిగి పూర్తి స్థాయ బేబిలా మారింది. కాని సడెన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో ఆ బేబీ మృతి చెందింది. దీంతో ఆ పిండాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బయిటికి తీయాలని డాక్టర్లు చెప్పారు.
అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో నిజాయితీ గత ప్రేమ ఉందంటే అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. అది స్వచ్ఛమైనది. నవమాసాలు మోసి కన్న బిడ్డకు, తల్లికి మధ్య ఉండే బంధమే వేరు. అది వర్ణణాతీతం.
ఇప్పుడు మనం చదువుకోబోయే కథనం కూడా అటువంటిదే. అమ్మ ప్రేమ ఎంత విలువైందో.. బలమైందో చెప్పే కథనం ఇది. యూఎస్ లోని మిస్సోరిలో చోటు చేసుకున్నది. షరన్, మైకెల్ అనే దంపతులకు చాలా ఏళ్ల నుంచి పిల్లలు పుట్టలేదు. చివరకు 40 ఏళ్లకు ఆమె గర్భం దాల్చింది. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాము కనబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నారు. షరన్ గర్భం దాల్చి 14 వారాలు అయిన తర్వాత వారికి డాక్టర్లు భరించలేని నిజాన్ని చెప్పారు.
కడుపులో ఉన్న 14 వారాల బిడ్డ అంటే మూడున్నర నెలల వయసులో ఉన్నప్పుడే చనిపోయిందని చెప్పారు. దీంతో వాళ్లు తట్టుకోలేకపోయారు. అయితే 14 వారాలకే బిడ్డ చనిపోయినప్పటికీ… అప్పటికే బిడ్డకు కాళ్లు, చేతులు అన్నీ పెరిగి పూర్తి స్థాయ బేబిలా మారింది. కాని సడెన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో ఆ బేబీ మృతి చెందింది. దీంతో ఆ పిండాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బయిటికి తీయాలని డాక్టర్లు చెప్పారు.
కానీ.. దానికి ఆ దంపతులు ఒప్పుకోలేదు. తమ బిడ్డను అలా ముక్కలు ముక్కలుగా చేయడానికి ఇష్టపడక.. సర్జరీ చేసి బేబీని బయటికి తీయాలని కోరారు.
14 వారాల పసిగుడ్డు ఎంత ఉంటుంది చెప్పండి. 4 ఇంచుల పొడవు ఉంది. 26 గ్రాముల బరువు అంతే. సాధారణంగా బేబీ పుట్టాక ఎలా ఉంటుందో ఆ పసిగుడ్డు కూడా అలాగే ఉండటంతో ఆ పిండాన్ని పాతిపెట్టడానికి వాళ్లకు మనసు ఒప్పలేదు. ఆ బేబీని తమ జీవితాంతం ఓ జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నారు. ఓ వారం పాటు ఫ్రీజర్ లో దాచిపెట్టారు.
తర్వాత హైడ్రేంజియా అనే ఓ పూల మొక్కను తీసుకొచ్చి కుండీలో నాటారు. కుండీలో నాటిన తర్వాత ఉన్న మట్టిలో తమ బేబీని పూడ్చారు.
బేబీని పూడ్చడానికి ముందు బేబీ చేతులు, కాళ్లను నిమురుతూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పూలకుండినే తమ బిడ్డగా భావించి దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ తమ జీవితాన్ని గడిపేస్తోంది ఆ జంట.
అయితే ఈ ఘటనను ఒక కథనం కోణంలోనే కాకుండా… తల్లిబిడ్డ ప్రేమకు అనుబంధానికి ప్రతీకగా చూడాలి. తల్లీబిడ్డ అనుబంధం చావుతో పోదని.. అది జన్మజన్మల బంధం అని ఈ ఘటన నిరూపించింది. తన బిడ్డ జీవితాంతం తనతోనే ఉండాలని… పూల కుండిలో తన బిడ్డను పూడ్చిపెట్టి.. రోజురోజుకూ పెరిగి పెద్దవుతున్న ఆ మొక్కలో తన బిడ్డను చూసుకుంటోంది ఆ తల్లి.