కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్‌ మరో తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ ( HRA ) ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్‌. రివైజ్‌ చేసిన హెచ్‌ఆర్‌ఏ ను ఆగస్టు మాసం నుంచి ఉద్యోగులకు అందుకోనున్నారు. డీఏ 25 శాతం దాటినందున హెచ్‌ఆర్‌ఏ పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం ఉత్వర్వుల ప్రకారం… కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు వారు నివసిస్తున్న పట్టణాలను బట్టి వివిధ కేటగిరిలుగా హెచ్‌ఆర్‌ఏను అందుకుంటారు. ఎక్స్‌ కేటగిరీ సిటీల్లో ఉన్న వాళ్లకు 27 శాతం మరియు వై, జడ్‌ కేటగిరీలకు 19.9 శాతం పెంపు ఉంటుంది. డీఏ 50 శాత్ దాటితే.. హెచ్‌ ఆర్‌ఏ రేట్లు కేటగిరీలను బట్టి 30 శాతం, 20 శాతం, 10 శాతంగా రివైజ్‌ అవుతాయి. కాగా… ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై 1 నుంచి కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి 28 శాతానికి మోడీ సర్కార్‌ పెంచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version