అన్నదాతలకు గుడ్ న్యూస్. భారతదేశంలోని అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అన్నదాతలకు రిలీఫ్ ని కలిగించనుంది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఎరువుల ధరలను తగ్గించాలని చూస్తోంది. కంపెనీ తన ఉత్పత్తుల ధరలను 14 శాతం వరకు తగ్గించబోతోంది.
ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కంపెనీ తన ఉత్పత్తుల ధరలను 14 శాతం దాకా తగ్గిస్తుందట. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత, వ్యవసాయానికి ఎరువుల ధర పెరుగుతుండడం వలన ఈ నిర్ణయం ని తీసుకుంటున్నారట. ఈ మార్పు చేయడం వలన పేద రైతులు కి బెనిఫిట్ కలగనుంది.
రైతుల సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఎరువుల తయారీకి ఇప్పుడు కొత్త టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నారు. కనుక ఎరువుల ధర తగ్గుతోంది. దీంతో రైతులకు ప్రయోజనం కలగనుంది. రైతులకు ఎరువుల వాడకంపై సబ్సిడీని ఇస్తుంది. 80 శాతం వరకు సబ్సిడీని ఎరువుల కంపెనీలకు ఇస్తోంది.
ముఖ్యమైన ఎరువులైన ఎన్‌పీకేఎస్ ధర రూ.200 నుంచి రూ.1200కి తగ్గింది ఇప్పుడు. ఇదిలా ఉంటే 2023 బడ్జెట్ లో ఎరువుల పై సబ్సిడీ లో పెద్ద కోత పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. ఎరువుల సబ్సిడీకి మొత్తం రూ.1.75 లక్షల కోట్లు ని ప్రభుత్వం కేటాయించింది.