ఉక్రెయిన్‌కు తమ అండ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా సహా మిత్రదేశాలు ఉక్రెయిన్ వెన్నంటే ఉంటాయని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఏడాది పూర్తైన నేపథ్యంలో బైడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పాశ్చాత్య సంకల్పాన్ని ఈ యుద్ధం కఠినతరం చేసిందని బైడెన్ వ్యాఖ్యానించారు. పోలాండ్ వార్సాలోని ప్రఖ్యాత రాయల్ క్యాసిల్ వేదికగా పౌరులు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్యాలు నేటికి, రేపటికి, ఎప్పటికీ స్వేచ్ఛకు రక్షణగా నిలుస్తాయని బైడెన్ ఉద్ఘాటించారు. ఈ యుద్ధం ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలు దెబ్బతీయటమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయిన మరుసటి రోజే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కీవ్ బలంగా, గర్వంగా ఉందని బైడెన్ పేర్కొన్నారు.