రైతులకి గుడ్ న్యూస్… ఖాతా లో డబ్బులు అప్పుడే..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. రైతుల కోసం కూడా కేంద్రం ఎన్నో పథకాల్ని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన వాటిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఉచితంగానే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది. ఇలా రైతుల కి ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు కూడా అందుతున్నాయి. దీని వల్ల చాలా మంది రైతులు ప్రయోజనం ని పొందుతున్నారు.

ఇప్పటికే 13 విడతల డబ్బులను రైతుల అకౌంట్ లో జమ చేసింది. ఒక్కో విడతకు రూ. 2 వేల చొప్పున లెక్కిస్తే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే రూ. 26 వేలు జమ అవుతాయి. భారత ప్రభుత్వం 13వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులను ఆలస్యంగా రైతుల అకౌంట్ లో జమ చేసింది. మాములుగా ఏప్రిల్ నుంచి జూలై మద్యలో ఈ డబ్బులు వస్తాయి. రెండో విడత డబ్బులు ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య లో పడతాయి. మూడో విడత డబ్బులైతే డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో పడతాయి.

ఇలా చూస్తే ఏప్రిల్ నుంచి జూలై మధ్య లో పీఎం కిసాన్ 14 వ విడత డబ్బులు రావాలి. 13వ విడత డబ్బులు ఫిబ్రవరి 26న వచ్చాయి. అలానే 14వ విడత డబ్బులు ఏప్రిల్ నుంచి జూలై మద్య లో రావాల్సి ఉంది. ఈ సారి కూడా డబ్బులు ఆలస్యంగా వస్తాయి. కచ్చితంగ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలని అంటోంది. లేకపోతే మాత్రం డబ్బులు రాక పోవచ్చు. ఆన్‌లైన్‌ లోనే మీరు ఈ పని పూర్తి చేయచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో చేసుకోవడం రాకపోతే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పూర్తి చేయచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version