లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. పైగా చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశ పెట్టిన పాలసీలతో బెనిఫిట్స్ ని పొందుతున్నారు. భవిష్యత్తు కోసం చాలా మంది డబ్బులని సేవ్ చేసి వీటిల్లో పెడుతున్నారు. దీని వలన భవిష్యత్తు లో సమస్యలు ఏమి వుండవు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ సర్వీసుల్ని తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. వాట్సాప్ సేవలని మొదటి సారి తీసుకు వచ్చాము అని ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎం.ఆర్. కుమార్ అన్నారు. 8976862090 అనే నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేసి డైరెక్ట్ గా మీరు వాట్సాప్ సేవలను పొందవచ్చు.
ఈ సేవలను వాట్సాప్ ద్వారా పొందండి:
పాలసీ స్టేటస్ ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
లోన్ ఇంట్రెస్ట్ డ్యూ ని తెలుసుకోవచ్చు.
లోన్ ఎలిజబులిటీ కొటేషన్, లోన్ రీపేమెంట్ కొటేషన్ ని కూడా వాట్సాప్ లో పొందొచ్చు.
ప్రీమియం పెయిడ్ సర్టిఫికెట్ ని చూడచ్చు.
అలానే ULIP- స్టేట్‌మెంట్ ఆఫ్ యూనిట్స్ ని కూడా ఇంటి నుండి పొందొచ్చు.
LIC సర్వీసెస్ లింక్స్, Opt in/Opt out సర్వీసెస్, ఎండ్ కన్వర్జేషన్ అన్నీ వాట్సాప్ నుండే.
ఎలా ఈ సేవలని పొందాలి..?
LIC India Forever తన ట్విట్టర్ ఖాతాలో ఎలా ఈ సేవలని పొందాలి అనేది చెప్పింది.
8976862090 అనే మొబైల్ నంబర్‌కు పాలసీ వున్నవాళ్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి Hi అని మెసేజ్ పెడితే చాలు ఈ సేవలన్నిటినీ ఈజీగా పొందొచ్చు.