Chiranjeevi: మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌లో సుకుమార్..కీలక అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో తన 154వ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ కాగా, ఈ ఫిల్మ్ షూటింగ్ లో తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎంటరయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ మూవీ సెట్స్ లో సుకుమార్ కు దర్శకుడు బాబీ..మెగాస్టార్ ఫిల్మ్ యాక్షన్ సీక్వెన్సెస్ చూయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను డైరెక్టర్ బాబీయే స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

చిరంజీవి యాక్షన్ సీక్వెన్సెస్ లో అదరగొట్టారని, మెగాస్టార్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవల్ అని అంటున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’గా అభిమానులను పలకరించారు. కాగా, ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి ప్యారలల్ గా ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాల షూటింగ్స్ లోనూ పాల్గొంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version