పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

-

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. కొత్త నిబంధలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకు వచ్చింది. దీనితో ప్రావిడెంట్ ఫండ్ కలిగిన వారికి రిలీఫ్ కలగనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎఫ్ మనీ విత్‌డ్రా సమయంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్బులు కోసం అప్లై చేసుకుంటే అది విత్ డ్రా అయ్యే అవకాశం వుంది.

ఇలా పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ సమస్యలకు ఉండకూడదని కొత్త నిబంధలను తీసుకు వచ్చారు. పీఎఫ్ క్లెయిమ్ ఎక్కువ సార్లు రిజెక్ట్ అవుతుంటే ఆ సమస్యలను వెంటనే సాల్వ్ చేసేయాలని ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేసింది. అలానే పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవ్వకుండా పెండింగ్ లో ఉంటే వాటిని కూడా సాల్వ్ చెయ్యాలని చెప్పింది. పీఎఫ్ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందాయని.. పీఎఫ్ క్లైమ్స్ రిజెక్ట్ అవుతున్నాయని మంత్రిత్వ శాఖ అంది.

అంతే కాక ప్రతి క్లెయిమ్‌ను పూర్తిగా పరిశీలించాలని సూచించింది. అయితే ఒకవేళ కనుక క్లెయిమ్ రిజెక్ట్ అయితే దానికి గల కారణాలని చెప్పాలని కూడా చెప్పారట. చాలా సార్లు రిజక్ట్ అయితే ఆర్‌పీఎఫ్‌సీ 2, ఏపీఈఎస్ బాధ్యత తీసుకోవాలని కొత్త నిబంధనని తీసుకు వచ్చారు. ప్రతి నెలా రిజెక్ట్ అయిన క్లెయిమ్స్‌లో 50 లేదా ఒక శాతాన్ని ఆర్‌పీఎఫ్‌సీ 1 లేదా ఓఐసీ చెక్ చెయ్యాలని చెప్పారు. ఎక్కువ సార్లు రిజెక్ట్ అయిన పీఎఫ్ క్లెయిమ్స్ యొక్క రిపోర్ట్స్ ని జోనల్ ఆఫీస్‌కు పంపాల్సి ఉందిట.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version