చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. ఇలా డబ్బులు పెట్టడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. కొన్ని స్కీమ్స్ లో అయితే డబ్బులు పెడితే డబుల్, ట్రిపుల్ కూడా చేసుకో వచ్చు. పైగా ఈ స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇక ఎలాంటి స్కీమ్స్ తో ఎక్కువ డబ్బులు వస్తాయి..? ఎలా డబ్బులు డబుల్ అవుతాయి అనేది చూసేద్దాం.
బ్యాంక్ ఎఫ్‌డీలకు ఈ మధ్యన డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఎంత డబ్బులు వస్తాయి అనేది బ్యాంక్ ని బట్టీ ఉంటుంది. ఈ వడ్డీ రేటు అనేది మారుతుంది. స్టేట్ బ్యాంక్ ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 6.1 శాతం వడ్డీని ఇస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అయితే 7 శాతం ఇస్తోంది. 6.1 శాతం వడ్డీ రేటు ప్రకారం అయితే ఈ డబ్బులు 11.8 ఏళ్లల్లో రెట్టింపు అవుతాయి.
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా చాలా మంచి లాభాన్ని ఇస్తుంది. గ్యారంటీ రిటర్న్ సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఇప్పుడు 7 శాతం వడ్డీ వస్తోంది. 123 నెలల్లో డబ్బులు రెట్టింపు అవుతాయి. రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అవి పదేళ్ల 3 నెలలకు రూ. 20 లక్షలు అవుతాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా డబ్బులు పెట్టచ్చు. కానీ రిస్క్ అయితే ఉంటుంది. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడే మ్యూచువల్ ఫండ్స్ పని చేస్తాయి. ఇందులో డబ్బులు పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో సగటున 12 శాతం వరకు వస్తోందిట. మీరు పది లక్షలు పెడితే ఆరేళ్ల లో అవి రూ. 20 లక్షలు అవుతాయి.