BREAKING: దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ !

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చాలా ముఖ్యమైన మరియు కీలకమైన నిర్ణయం తీసుకుని వారికి శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఆర్డర్ నెంబర్ 77 ప్రకారం ఇక నుండి APPSC ఉద్యోగాల నియామకాలు మరియు ప్రమోషన్ లకు సంబంధించి దివ్యాంగుల కోసం 4 శాతాన్ని రిజర్వేషన్ ను ప్రవేశపెట్టింది. ఈ దివ్యాంగుల విభాగంలో చెవిటి వారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం మరియు మానసిక రోగులను ఈ జాబితాలో ప్రభుత్వం చేర్చడం జరిగింది. కానీ ఈ రిజర్వేషన్ లోనూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని పేర్కొనడం విశేషం. ఇక వివిధ పోస్ట్ లకు సంబంధించి అర్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులు అయి ఉండాలని తెలిపింది.

కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా psc .ap .gov .in సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ తెలిపింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు హరఃసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version