WORLD CUP 2023: శ్రీలంకపై ఇంగ్లాండ్ ఘోర ఓటమి !

-

వరల్డ్ కప్ లో ఈసారి అసలైన వినోదం అందుతోంది అని చెప్పాలి. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీం ఇప్పటి వరకు ఆడిన అయిదు మ్యాచ్ లలో నాలుగు ఓటములతో సెమీస్ కు చేరడానికి అవకాశం లేకుండా పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కేవలం 156 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి అప్రతిష్టను మూటగట్టుకుంది. అనంతరం శ్రీలంక మరో 25 ఓవర్లు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి సెమీస్ కు ఇంకా ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఛేదనలో ఓపెనర్ నిస్సంక (77) మరియు సమరవిక్రమ (65) అర్ద సెంచరీ లతో రాణించి శ్రీలంకకు గెలుపును సాధించి పెట్టారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ లలో నాలుగు ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానానికి పడిపోయింది.

ఇక శ్రీలంక ఆడిన అయిదు మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించి అయిదవ స్థానానికి చేరుకుంది. మరి ఇదే ఊపుతో శ్రీలంక సెమీస్ కు చేరుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని మ్యాచ్ లు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version