స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మంది లాభాలని పొందుతున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో మీకు కూడా ఖాతా ఉందా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ ఏ. బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త ని అందించింది. బ్యాంక్ లో డబ్బులని దాచుకునే వాళ్లకి ఇది గొప్ప అవకాశం. సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ స్కీమ్‌ ని అందిస్తోంది. ఈ స్కీమ్ గడువును మరో మూడు నెలలు ని పొడిగించింది బ్యాంక్.

స్కీమ్ గడవు మార్చి 31తోనే ముగియాల్సి ఉంది. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు మరి కొంత కాలం ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశం తో గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్ కోసం అధిక రాబడి అందించడమే లక్ష్యంగా ఎస్‌బీఐ వీ కేర్ డిపాజిట్ పథకాన్ని బ్యాంకు తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ ని ఇంకో మూడు నెలలు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ వస్తోంది.

ఇతర ఎఫ్‌డీ పథకాలపై సీనియర్ సిటిజన్లకు అందించే అదనపు 50 బేసిస్ పాయింట్లు ఏ కాదు మరో 50 బేసిస్ పాయింట్ల ని పెంచింది. రెగ్యులర్ కస్టమర్ల కన్నా 100 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ ని పొందొచ్చు. ఈ స్కీమ్ తో ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు వడ్డీ వస్తోంది. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. నెట్ బ్యాంకింగ్ లేదా నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి మీరు ఈ స్కీమ్ లో చేరచ్చు.

లేకపోతె మీరు స్టేట్ బ్యాంక్ యోనో యాప్ కి వెళ్లి ఈ స్కీమ్‌లో చేరచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ వస్తోంది.
7 రోజుల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ ఎఫ్‌డీ లకి ఇది వర్తిస్తుంది. అదే ఏడాది నుండి రెండు ఏళ్ళ టెన్యూర్లపై అయితే 7.3 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల టెన్యూర్ ఎఫ్‌డీలపై 7 శాతం వరకు వడ్డీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version