ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి అలర్ట్.. కేంద్రం కొత్త రూల్స్..!

-

మనకి వుండే ముఖ్య డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన ఎన్నో లాభాలు వున్నాయి. ఆధార్ కార్డు అందరికీ తప్పనిసరి. భారత పౌరులందరికీ ఆధార్ కార్డు ఉండాలి. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తోంది కేంద్రం. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. తప్పని సరిగా ఆధార్ ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు ఉండాలి. ఈ నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి. స్కీమ్స్ మొదలు భూముల రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ పనుల కల్పన, బ్యాంక్ పాస్‌బుక్, భూముల క్రయవిక్రయాలు అన్నింటికీ కూడా ఆధార్ కార్డు ఉండి తీరాలి.

పైగా వీటిల్లో సవరణలు చేసుకునే విధానం ని గతం లో చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు మాత్రం అది కాస్త క్లిష్టంగా మారిపోయింది. మోసాలు ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డాక్యుమెంట్లు, వయసు బట్టి కేటగిరీల వారీగా సబ్మిట్ చేసే మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది UIDAI. దరఖాస్తు విధానాన్ని మొత్తంగా మార్చింది. మూడు కేటగిరీలుగా మార్చింది. ఆధార్ కార్డు సవరణ చేసుకునే వాళ్లకి వయసుల వారీగా మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు. ఇది వరకు అయితే ఇలా లేదు. రెండు రకాల దరఖాస్తు పత్రాలు ఉండేవి.

ఐదేళ్లలోపు పిల్లల్ని మొదటి కేటగిరీలో, 5-18 ఏళ్ల లోపు వారిని రెండో కేటగిరీలో, 18 సంవత్సరాలు దాటితే మూడవ కేటగిరి కింద విభజించారు. ఆధార్ ని పదేళ్లకోసారి పునరుద్ధరించుకోవాలని అన్నారు. చిరునామా ని మార్చడం కోసం అవసరమయ్యే అడ్రస్ ప్రూఫ్స్ జత చేయాలి. గతంలో గెజిటెడ్ అధికారి సంతకంతో పేరు, తండ్రి పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ మార్చేందుకు అయ్యేది. కానీ ఇప్పుడైతే మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్ జారీ చేసే గుర్తింపు పత్రాన్ని చూపించాల్సి ఉంది.

పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు తో సరి చెయ్యచ్చు. పేరులో మార్పు చేయాలంటే ఫొటో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి. టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ఇవి ఏమైనా ఉండాలి. అదేపెళ్లి అయిన వాళ్ళు అయితే వివాహ ధ్రువపత్రం, తహశీల్దారుచే జారీ చేసే కుల ధ్రువపత్రం ని సబ్మిట్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version