హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులని తీసుకు రావడం జరిగింది. ఇక వీటి కోసం పూర్తిగా చూస్తే… బ్యాంక్ సర్వీసులు ఇక గ్రామాల్లో కూడా అందుబాటు లోకి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కామన్ సర్వీస్ సెంటర్ జత కట్టాయి.
ఇది ఇలా ఉండగా చాట్‌బాట్ ఎవా సర్వీసులను సీఎస్‌సీ డిజిటల్ సర్వీసెస్ పోర్టల్ లో కూడా అందుబాటు లోకి తెచ్చాయి. దీనితో గ్రామాల్లో కూడా ఎంట్రప్రెన్యూర్లకు గ్రామీణ ప్రాంత కస్టమర్లకు ఎండ్ టు ఎండ్ బ్యాంకింగ్ సర్వీసులు అందించడానికి సిద్ధం అయ్యారు.
1.5 లక్షల గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్లు తో పాటుగా టౌన్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎండ్ టు ఎండ్ ఫైనాన్షియల్ సర్వీసులు అందించడం ఈ పార్ట్నర్ షిప్ వలన కుదురుతుంది. దీనితో విలేజ్ లెవెల్ ఎంట్రప్రెన్యూర్స్ ఎవా ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రొడక్టులు, సర్వీసుల గురించి తెలుసుకుని బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఒకవేళ ఏమైనా సందేహాలు ఏమైనా వున్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ నుండి ఏ సమాచారం అయినా కూడా తెలుసుకోవచ్చు.