సోనూసూద్ మ‌రో గొప్ప నిర్ణ‌యం.. ఇది మామూలు విష‌యం కాదు!

-

సోనూసూద్.. ఈ పేరు కోట్ల మందికి ధైర్యాన్ని ఇస్తుంది. ల‌క్ష‌ల మందికి అండ‌గా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా గ‌తేడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మారుమోగిపోతూనే ఉంది. ఆప‌దొస్తే ఆ పేరే వినిపిస్తోందంటే.. ఎంత గొప్ప వ్య‌క్తో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వాలు, కోటీశ్వ‌రులు సైతం నిమ్మ‌కుండిపోతుంటే.. తాను మాత్రం దేశ ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని సేవ‌లు చేస్తూ ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోతున్నారు.

ఇప్ప‌టికే కొవిడ్ రోగుల‌కు ఎన్నో సేవ‌లు అందిస్తున్నారు సోనూసూద్‌. దేశ వ్యాప్తంగా బెడ్లు అందుబాటులో ఉంచ‌డం, ఆక్సిజ‌న్ స‌ప్లై చేయ‌డం, నిరాశ్ర‌యుల‌కు తిండి, ఇత‌ర అవ‌స‌రాలు చూడ‌టంతో ఇలా త‌న సేవ‌లు కొన‌సాగిస్తున్నారు. అర్ధ‌రాత్రి వ‌ర‌కు ప్ర‌జ‌ల నుంచి అభ్య‌ర్థ‌న‌లు స్వీక‌రిస్తూ.. ఎక్కడ ఎవ‌రికి ఆప‌ద వ‌చ్చినా క్ష‌ణాల్లో సాయం చేస్తున్నారు.

ఇక ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని ఔరా అనిపిస్తున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొర‌త ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ స‌మ‌స్య‌ను తీర్చేందుకు సోనూసూద్ ఏకంగా ఇండియాలో ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇందుకోసం ప్రాన్స్‌, ఇత‌ర దేశాల నుంచి సామాగ్రిని దిగుమ‌తి చేసుకుంటున్నాడు. మ‌రో 10, 12రోజుల్లో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తాన‌న్నాడు. ఇందులో ఒక్కో ప్లాంటు దేశానికి ఒక రోజుల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేస్తుంద‌ని చెప్పాడు. ఈ విష‌యం తెలియ‌డంతో.. దేశ ప్ర‌జ‌లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. మ‌నిషి రూపంలో ఉన్న దేవుడంటూ కొలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version