తెలుగు ప్రయాణికులకు శుభవార్త.. 16 నెలల తర్వాత పట్టాలెక్కనున్న 82 రైళ్లు

-

హైదరాబాద్: ఈ నెల 19నుంచి తెలుగు ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కరోనా కారణంగా రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖంపట్టిన సందర్భంగా పలు రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా ల తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

మొత్తం 16 ఎక్స్‌ప్రెస్‌, 66 ప్యాసింజర్‌ రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. కొత్తగా ప్రారంభం కాబోయే రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాలే కాక, కర్ణాటక రాయచూరు వరకు తిరుగుతాయని గజానన్ పేర్కొన్నారు. ఈ రైళ్లను కొత్త నంబర్లతో నడపనున్నట్లు జీఎం గుజనన్ మాల్యాల వెల్లడించారు. ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి రైల్వే స్టేషన్లలోనే టికెట్లు ఇస్తారని తెలిపారు. అయితే ప్రయాణికులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని రైల్వే జీఎం కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version