Breaking : పట్టాలు తప్పి గూడ్స్ రైలు.. నిలచిపోయిన పలు రైళ్ల రాకపోకలు

-

రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు(Goods train) పట్టాలు తప్పింది. రాజమండ్రి ఐఎల్టీడీ ప్లైఓవర్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని భోగిని పట్టాలపై నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

పూర్తిగా రద్దయిన రైళ్లలో విజయవాడ-విశాఖపట్టణం (12718), విశాఖ-విజయవాడ (12717), గుంటూరు-విశాఖ (17239), విశాఖ-గుంటూరు (17240), విశాఖ-విజయవాడ (22701), విజయవాడ-విజయవాడ (22702), విజయవాడ-గుంటూరు (07628), గుంటూరు-విజయవాడ (07864), కాకినాడ పోర్ట్-విజయవాడ (17257) రైళ్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version