పర్సన్ ఫైండర్ టూల్ ను యాక్టివేట్ చేసిన గూగుల్
వర్షాలు, వరదాల కారణంతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మిలియన్ డాలర్లు (దాదాపు 7 కోట్లు) ను విరాళంగా ప్రకటించింది. తమ వంతు సాయంగా గూగుల్.ఓఆర్జీ, గూగులర్స్ సంయుక్తంగా కేరళకు సాయం చేయడానికి నిర్ణయించినట్లు సంస్థ సీనియర్ అధికారి, ఆగ్నేయాసియా, ఇండియా ఉపాధ్యక్షుడు ఆనంద్ తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ టీమ్ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేరళలో వరదల కారణంగా విచ్ఛిన్నమైన కుటుంబాలను ఒకే దగ్గరికి చేర్చే విధంగా మరియు ఇతర సాయాలను అందించేందుకు పర్సన్ ఫైండర్ టూల్ ని యాక్టివేట్ చేసింది. దీని ద్వారా ఇప్పటికే 22 వేల మందికి సమాచారం తెలిసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 417 మంది మరణించగా, 8 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే…