నాగార్జున దేవా లుక్.. అదిరిపోయింది

-

కింగ్ నాగార్జున స్టైలిష్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తనయులిద్దరు హీరోలుగా రానిస్తున్నా సరే టాలీవుడ్ మన్మధుడు అంటే నాగార్జున వైపే వెళ్లన్ని చూపిస్తాయి. ప్రస్తుతం నానితో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న నాగార్జున ఈమధ్యనే టీజర్ తో దాసు ఏంటి సంగతి అంటూ ఆడియెన్స్ లో సినిమా అంచనాల డోసు పెంచేశాడు. ఇక ఇప్పుడు సినిమాలోని తన స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

సినిమాలో డాన్ అయినా స్టైలిష్ డాన్ గా నాగార్జున కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దేవా పాత్రలో నాగార్జున చాలా అందంగా కనిపిస్తున్నారు. రీసెంట్ గా దేవదాస్ సినిమా నుండి బయటకు వచ్చిన పిక్స్ లో నాగార్జున లుక్ అదిరిపోయింది. నాగార్జున, నాని కలిసి చేస్తున్న దేవదాస్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా రేపు అనగా ఆగష్టు 29న సినిమా నుండి మరో స్పెషల్ టీజర్ ఏదైనా వస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే నాగ్ బర్త్ డే నాడు అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో మూవీ నుండి మాత్రం ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version