సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. పిక్సల్ 4ఎ పేరిట ఆ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో 5.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్‌ను అమర్చారు. 6జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12.2 మెగాపిక్సల్ కెమెరాను, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండు కెమెరాలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తాయి.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లభిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 3140 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేయగా.. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
గూగుల్ పిక్సల్ 4ఎ స్పెసిఫికేషన్లు…
* 5.81 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్
* 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* 12.2, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయల్ సిమ్ (సింగిల్ నానోసిమ్ + ఇ-సిమ్)
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 4.1 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
* 3140 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
గూగుల్ పిక్సల్ 4ఎ స్మార్ట్‌ఫోన్ కేవలం బ్లాక కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదలైంది. దీని ధరను 349 డాలర్లు (దాదాపుగా రూ.26,245)గా నిర్ణయించారు. ఈ ఫోన్‌కు గాను అమెరికాలో ఇప్పటికే ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఆగస్టు 20 నుంచి అక్కడ సేల్స్ ప్రారంభమవుతాయి. భారత్‌లో ఈ ఫోన్‌ను అక్టోబర్‌లో లాంచ్ చేస్తారు. అప్పుడు ఇక్కడ ఈ ఫోన్ ధర తెలుస్తుంది. ఇక ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు.