ఏపీలో కరోనా జోరు రోజు రోజుకు జోరందుకుంటోంది. ఇప్పటికే కరోనా కేసులు 1.60 లక్షలు దాటగా.. మరణాలు 1500కు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక తెలంగాణతో పోలిస్తే ఏపీలో కేసులు ఎక్కువుగా ఉన్నాయి. అయితే ఇందుకు ప్రధాన కారణం పరీక్షలు ఎక్కువుగా చేయడమే అంటున్నారు నిపుణులు. ఏపీలో జరిగినన్ని కరోనా పరీక్షలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. కరోనా పరీక్షల్లో ఏపీ సరికొత్త రికార్డులు బద్దలు కొట్టింది. అందుకే అక్కడ కరోనా కేసులు కూడా ఎక్కువుగా నమోదు అవుతున్నాయని అంటున్నారు.
ఇక జగన్ ఇక్కడ కరోనాను కట్టడి చేసేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ఈ మూడు సూత్రాలను మాత్రమే తారకమంత్రంగా ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ మూడు ఖచ్చితంగా అమలు చేసే రాష్ట్రాలు దేశంలో ఒకటో రెండో మాత్రమే ఉంటున్నాయి. కేసులు ఎక్కువ అయితే తమ రాష్ట్ర ప్రజల్లో ఎక్కడ ఆందోళన ఎక్కువ అవుతుందో ? అని భావిస్తోన్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేసులు ఎక్కువుగా చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం కరోనా పరీక్షల విషయంలో ఎంతమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కేవలం కరోనా పరీక్షల కోసమే ప్రభుత్వం రోజుకు రు. 5 కోట్లు ఖర్చు చేస్తోంది. నెలకు రు. 350 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్తాయిలో ప్రభుత్వం పరీక్షలు చేస్తుండడంతోనే ఇప్పడు రోజుకు 70 వేల మందికి కూడా కరోనా పరీక్షలు సులువుగా చేయగలుగుతున్నారు. కరోనా పరీక్షలు పెరుగుతుండడంతోనే ఏపీలో కేసులను గుర్తించడం కూడా సులువు అవుతోంది.
ఏపీలో కరోనా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నా.. మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి అంతకన్నా ఘోరంగానే ఉందని.. అయితే అక్కడ పరీక్షలు ఎక్కువ జరగకపోవడంతోనే కేసులు తక్కువ ఉన్నట్టు కనిపిస్తోందని.. అయితే జగన్ ఈ విషయంలో ముందే మేలుకుని పరీక్షలు ఎక్కువ చేయడంతో పాజిటివ్ వచ్చిన వారు మరింతగా జాగ్రత్తపడే వీలుటుందని చెపుతున్నారు.