కోహ్లి త‌ర్వాత టీమిండియా కెప్టెన్ ఆ ఆట‌గాడే?

-

దుబాయ్ వేదిక‌గా టీమిండియా ప‌సికూన న‌మీబియా తో ఈ రోజు త‌ల‌ప‌డుతుంది. ఈ మ్యాచ్ కు ముందు టాస్ స‌మ‌యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కెప్టెన్ విష‌యం తో ప‌లు కీల‌క వాఖ్య‌లు చేశాడు. త‌న త‌ర్వాత టీమిండియా కు కెప్టెన్ ఎవ‌రు ఉంటార‌ని అనే ప్ర‌శ్న కు విరాట్ కోహ్లి కాస్త స్ప‌ష్ట‌త ఇచ్చాడు. త‌న త‌ర్వాత టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ నే కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని కోహ్లి చెప్ప‌కనే చెప్పారు.

కెప్టెన్ అంటే జ‌ట్టు బాధ్య‌త మొత్తం ఆయ‌న ఆధినం లో నే ఉంటుంది అని అన్నారు. దానికి మంచి ఆట‌గాన్ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని విరాట్ కోహ్లి అన్నారు. అలాగే చాలా రోజుల నుంచి టీమిండియా వ్య‌వ‌హ‌రాల గురించి, జ‌ట్టు విష‌యాల గురించి రోహిత్ శ‌ర్మ నే చూసుకుంటున్నాడ‌ని అన్నారు. దీంతో విరాట్ కోహ్లి త‌ర్వాత టీమిండియా కు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ నే వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని ప‌లువురు అంటున్నారు. అందుకే కోహ్లి కొంత వ‌ర‌కు హింట్ ఇచ్చాడ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version