సీఐడీ దుర్వినియోగం.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

-

టిడిపి పాలిటీ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందు కేసులు పెట్టి తరువాత విచారణ చేపడుతారా.? సీఐడి ని అడ్డుపెట్టుకుని సీఎం జగన్ జూలుం ప్రదర్శన చేశారు. కేసులు పెడితే భయపడను.. కోర్టు దిక్కరన చేసింది వైసీపీ. సిఐడిని దుర్వినియోగం చేస్తున్న మీకు ఎన్ని నోటీసులు ఇవ్వాలి అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ. కాపాడుతుంది. జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు.

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టుకెళ్లడాన్ని ఆక్షేపించించారు గోరంట్ల బుచ్చయ్య. పదేళ్లుగా సీఎం వై.ఎస్.జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జి పిటిషన్ వేస్తూ వాయిదాలు తీసుకుంటూ.. కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తప్పు పట్టారు ఎమ్మెల్యే గోరంట్ల. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పై సుప్రీంకోర్టులో సవాల్ చేయడాన్ని ఆక్షేపించారు. ఈనెల 24 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లను దూరంగా ఉంచాలని.. టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ను కోరినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version