మంత్రి హరీశ్ రావుతో వైసీపీ ఎంపీ గోరంట్ల చర్చలు !

-

ఆలేరు పట్టణ కేంద్రం లో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహావిష్కరణ చేశారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు. అయితే ఈ కార్యక్రమానికి  ఏపీ హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ కురుమ హాజరు కావడం విశేషం. అంతేకాదు హరీష్ రావు తో గోరంట్ల మాధవ్ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.  ఇక విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గారు మాట్లాడుతూ..

ఆలేరు నియోజకవర్గం లో ఎంతో స్ఫూర్తిని చూపిస్తూ దొడ్డి కొమురయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు.

దొడ్డి కొమురయ్య గారి పోరాట స్ఫూర్తితో నే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.కురుమ కులస్తులైన రాములు సాంబశివుడు నమ్మిన ధర్మం కోసం చివరి వరకు పోరాటం చేశారు.ఏ కులంలో నైనా ఐక్యత, విద్య ఉండాలి. కురుమ కులస్తులు కూడా ఐక్యమత్యంగా ఉండి విద్యలో రాణించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version