బిగ్ బాస్ 6: హోస్టింగ్ కి గుడ్ బై చెప్పనున్న నాగార్జున.. కారణం..?

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కి హోస్టుగా చేస్తున్న నాగార్జునపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. హౌస్ లో కొందరిపై ఫేవరిజం చూపిస్తున్నారనే కామెంట్లు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఇదంతా బిగ్ బాస్ టీం నాగార్జునకు పూర్తి వివరాలు చెప్పకపోవడంతోనే అని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ షో కి హోస్టింగ్ చేయాలని బిగ్ బాస్ టీం వాళ్లకు నాగార్జున చెప్పినట్లు ఇప్పుడు వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 14వ వారం ఇనయా సుల్తానా ఎలిమినేట్ అవ్వడంతోనే ఈ వార్తలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇనయ ఎలిమినేషన్ తో నాగార్జున అప్సెట్ అయ్యారని సమాచారం.. అందుకే బిగ్ బాస్ టీం తో చర్చించి ఇకపై బిగ్ బాస్ కి హోస్టింగ్ చేసే ఆసక్తి లేదని చెప్పేశారు. తర్వాత సీజన్ కు ఇంకెవరినైనా చూసుకోండని మరీ మరీ తేల్చి చెప్పినట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ఇనయ ఎలిమినేషన్ మాత్రమే కాదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు నాగార్జునకు నచ్చలేదు అని ఇప్పటికీ ఆయన హోస్టింగ్ చేయనని చాలా సార్లు చెప్పినా కూడా బిగ్ బాస్ టీం వినిపించుకోలేదని సమాచారం. దీంతో హోస్టింగ్ చేయనని ఖరాఖండిగా చెప్పినట్లు ప్రస్తుతం వార్త వినిపిస్తోంది.

అందుకు బిగ్ బాస్ టీం..మీరు బ్రాండ్ సార్.. మీరే కంటిన్యూ అయితే బాగుంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. మరొకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనేక విషయాలను నాగార్జున దగ్గర దాచేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై అటు బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే నాగార్జున హోస్టింగ్ కి గుడ్ బై చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version