తెలంగాణ వాసులకు సర్కార్ తీపి కబురు..మరో కొత్త పథకం..

-

తెలంగాణ సర్కార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేసింది.అర్హులైన దళితులకు రూ. 10 లక్షలు అందించి, వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిని సమకూరుస్తోంది ప్రభుత్వం. ప్రతి దళిత కుటుంబం కూడా పేదరికం నుంచి బయట పడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దళిత బంధు పథకం అమలు కావడంతో అనేక మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి.

నిన్నటి వరకు కూలీలుగా, డ్రైవర్లుగా, నెల జీతానికి పనిచేస్తున్నవారు.. నేడు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ యజమానులుగా మారారు..ఈ పథకం ద్వారా చాలా మంది జీవితాలు పూర్తిగా మారిపొయాయి..లబ్ది దారులు కెసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలు సొంతంగా వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షలు మంజూరు చేసి వారి వ్యాపారానికి పెట్టుబడి సాయం అందిస్తుంది ప్రభుత్వం.

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 100 యూనిట్ల దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది. నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు 400 యూనిట్లు మంజూరు అయ్యాయి..వీటిని విడతల వారిగా అధికారులు అందజెయనున్నారు..దళితబంధు పథకానికి అర్హులైన చాలామంది ట్రావెల్స్, ట్యాక్సీ వాహనాలను, ట్రాక్టర్లను, హార్వెస్టర్లను ఎంచుకొంటుండగా కొంత మంది వినూత్నంగా బట్టల దుకాణాలను, కోళ్ల పౌల్ట్రీను, ఇటుక బట్టీలను వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. లబ్ధిదారులకు ఏ వ్యాపారంలో అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ఎంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో పలు రకాల వ్యాపారాలను మొదలు పెట్టనున్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పై దళిత సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version