సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం నేరుగా సెక్రెటేరియట్ వెళ్లి ఉన్నతాధికారులు,అందుబాటులో ఉన్న మంత్రులతో హైలెవల్ మీటింగ్‌ను నిర్వహించనున్నారని సమాచారం.
ఎల్లుండి(జనవరి 26) నుంచి ప్రారంభించబోయే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలపై ఈ హైలెవల్ మీట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారుపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారని తెలిసింది.సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జిల్లాల్లో పర్యటించి పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేయనుండగా.. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని తెలుస్తోంది.