విశ్వక్ సేన్ కు షాక్ తగిలింది. KPHB ఆంటీలా ఉన్నావంటూ ఓ జర్నలిస్ట్ పరువు తీశాడు. మెకానిక్ రాకీలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించిన తర్వాత.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విరామం తీసుకోకుండా మళ్లీ యాక్షన్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం లైలా సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో లేడీ గెటప్ ధరించి అభిమానులను ఆశ్చర్యపరచనున్నాడు.

అయితే.. ఈ లైలా సినిమా ప్రమోషన్లలో జర్నలిస్టుల ప్రశ్నలు మితి మీరుతున్నాయి. దీంతో సదరు జర్నలిస్ట్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైలా.. కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందంటూ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ఇంటర్నేషనల్ ఫిగర్‌ను ఆంటీ అంటారా.. ఎంత అన్యాయం రా అంటూ సమాధానం ఇచ్చాడు హీరో విశ్వక్ సేన్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సినిమా ప్రమోషన్లలో మితిమీరుతున్న ప్రశ్నలు
లైలా కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్న జర్నలిస్ట్
ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అంటూ సమాధానమిచ్చిన హీరో విశ్వక్ సేన్ pic.twitter.com/cU5O9x2Qrh
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025