వృద్ధాప్య పింఛన్లు నిలిపివేసిన ప్రభుత్వం.. !

-

ఊరక సొమ్ములు వస్తుంటే కాదనే వారు ఎవరు.. అందుకే ప్రభుత్వం అందించే పధకాలను ప్రతి వారు అందిన కాడికి దోచుకోవడానికి సిద్దం అవుతుంటారు.. ఇలాంటి అక్రమాలే ఆసరా వృద్ధాప్య పింఛన్లలో వెలుగు చూసాయట.. ప్రభుత్వం వారు జరిపిన విచారణలో నిబంధనలకు విరుద్ధంగా 14,975 మంది పింఛన్లను కాజేసినట్లు తేలిందట. ఇక వయస్సు మళ్లీన పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో దంపతుల్లో ఒకరు మాత్రమే పింఛన్‌కు అర్హులు కాగా, అధికారుల కళ్లుగప్పి ఇద్దరు చొప్పున పింఛన్‌ పొందుతున్నట్లు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కనుగొన్నదట.

ఈ నివేదికను ప్రభుత్వానికి అందచేయగా ఈ మేరకు మే నెలకు సంబంధించి దాదాపు 30 వేల మందికి పింఛన్లను నిలిపివేసింది. ఇకపోతే పింఛన్‌ సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఇన్నాళ్లూ పొందిన వారి నుండి రికవరీ చేయాలని కూడా నిర్ణయించిందట. ఇక సామాజిక భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్‌ బాధితులకు రూ.2,016, వికలాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛన్‌ను అందజేస్తోంది.

 

 

కాగా కుటుంబసభ్యుల్లో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులు కానీ చాలాచోట్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా పింఛన్‌ పొందుతున్నట్లుగా ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన సెర్ప్‌ ఒక జాబితాను తయారు చేయగా, అందులో హైదరాబాద్‌లో 1,766, నల్లగొండ 763, మంచిర్యాల 756, కరీంనగర్‌ 674, రంగారెడ్డి 643, జగిత్యాల 626, నారాయణపేట 623, మేడ్చల్‌ 585, ఖమ్మం 558, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 546 మంది దొంగ పింఛన్‌ దార్లు ఉన్నట్లు తేలిందట.. అందుకే డబుల్‌ పింఛన్లను ఆపేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version