గవర్నర్ తమిళిసై పై మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. గవర్నర్ ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలని సూచించారు. ఇది విమోచనో.. విలీనము గవర్నర్ కి ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని అన్నారు కూనంనేని. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని.. గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికిరాదని అన్నారు.
సెప్టెంబర్ 17 ను విలీన దినోత్సవం గా డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యత దినం అనడం కెసిఆర్ చేస్తున్న పెద్ద తప్పు అని అన్నారు. 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటం మొదలైందని.. స్వతంత్రం వచ్చినా సమస్యలు పరిష్కారం కానందునే సాయుధ పోరాటం మొదలైంది అన్నారు. సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టులు 3 వేల గ్రామాలను విముక్తి చేశారని అన్నారు.
బిజెపి, ఆర్ఎస్ఎస్ చెప్పేది అబద్ధమని.. ముస్లిం పాలకుల నుండి హిందువులకు విముక్తి లభించిందని అనడం దుర్మార్గమన్నారు. నిజాం రాజు వేరు, ముస్లిం ప్రజలు వేరని అన్నారు. సాయుధ పోరాటం చేసింది 90 శాతం మంది హిందువులపైనేనని అన్నారు సాంబశివరావు. సెప్టెంబర్ 17న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున విలీన దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.