మునుగోడు కమలంలో ముసలం..సెట్ అవుతుందా?

-

మునుగోడులో బీజేపీకి గెలుపు అంత సులువుగా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా మునుగోడులో బీజేపీకి గెలవడం సులువు కాదు..ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్‌తో పాటు, కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. అలాగే ఇక్కడ ప్రజలు బీజేపీ వైపు చూసే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేత ఉండటం బీజేపీకి కలిసొచ్చే అంశం.

కానీ ఆయనకు ఉన్న బీజేపీ శ్రేణులు సహకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గంగిడి మనోహర్ రెడ్డి పోటీ చేసి 12 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే మునుగోడులో బీజేపీకి 10 వేల ఓటు బ్యాంక్ ఉంది..కానీ ఆ ఓట్లు పూర్తిగా రాజగోపాల్‌కు పడతాయా? లేదా? అనేది డౌట్. అదే సమయంలో గంగిడి సైతం…కోమటిరెడ్డికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా కోమటిరెడ్డి కూడా…మనోహర్ రెడ్డిని కలుపుకుని వెళ్ళే ప్రయత్నాలు చేయడం లేదు.

ఓ వైపు పరిస్తితి అలా ఉంటే..మరోవైపు మునుగోడు ఉపఎన్నిక ఇంచార్జ్ పరిస్తితి మరొకలా ఉంది. ఇంచార్జ్ పదవికి సీనియర్లు గట్టిగా పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డి..మునుగోడు ఉపఎన్నిక ఇంచార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారు.  ఇక వీరిలో ఇంచార్జ్ పదవి ఎవరికి ఇవ్వాలనే కన్ఫ్యూజన్‌లో బీజేపీ ఉంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల ఇంచార్జ్‌గా జితేందర్ రెడ్డి పనిచేశారు. అలాగే ఆ రెండు చోట్ల బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. దాంతో మునుగోడు ఇంచార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారు.

అటు వివేక్ సైతం బ్యాగ్రౌండ్‌లో బీజేపీకి మద్ధతుగా ఉన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటలకు అన్నీ రకాలుగా మద్ధతుగా నిలిచారు. దీంతో ఆయన కూడా మునుగోడు ఇంచార్జ్ పదవి కావాలని అంటున్నారు. అయితే కోమటిరెడ్డి, జితేందర్ రెడ్డి…రెడ్డి వర్గానికి చెందిన వారు..వివేక్ దళిత వర్గానికి చెందిన నేత…అందుకే వివేక్‌కు ఇస్తే మునుగోడులో దళిత వర్గం బీజేపీ వైపుకు వస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే మునుగోడు బీజేపీలో గట్టి పోటీ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version