ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పరిణామం చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
అంతేకాకుండా ఈ నిర్ణయం సరైనది కాదని గవర్నర్ ఈసీకి క్లాస్ పీకినట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో గవర్నర్ తో భేటీ అయిన వివరాలను మీడియాకి తెలపడానికి కూడా మొహం చూపించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్లిపోయారు. దీంతో తాజా పరిస్థితులు బట్టి ఎన్నికల సంఘం కార్యదర్శి, ఐజీతో ప్రత్యేకంగా భేటీ కావటం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.