ఇండ‌స్ట్రీలో కులం పిచ్చా… మీరు చౌద‌రీసా.. ప్ర‌స్తుతం కాపు యుగం…!

-

ఏ రంగంలో అయినా కులాల కంపు మామూలుగా ఉండ‌దు. అది రాజ‌కీయం అయినా.. సినిమాలు అయినా మ‌రొక‌టి అయినా అన్నీ కులాల‌తో కంపు కొట్టేస్తోంది. సినిమాలు.. రాజ‌కీయాల్లో ఇది మ‌రింత ఎక్కువైంది. ఇక తెలుగు రాజ‌కీయాల్లో… టాలీవుడ్‌లో ఇది మ‌రీ ఎక్కువ‌. అయితే ఈ కులాల రొచ్చుపై సీనియ‌ర్ న‌టుడు విజ‌య్ రంగ‌రాజు ఫైర్ అయ్యారు. కులం కంపుది అగ్రపీఠమే అంటున్నారు ఆయ‌న‌. ఈ కులాల కంపుపై ఆయ‌న మాట్లాడుతూ త‌న  పేరు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్.. నేను సినిమాల్లో నిలదొక్కుకున్న తరువాత ఓ పెద్దాయన.. మీరు చౌద‌రీసా అని అడ‌గ‌డంతో అవున‌ని చెప్పాన‌ని.. అప్పుడు ఆయ‌న చెప్పిన ఆన్స‌ర్‌తో తాను షాక్ అయ్యాన‌ని రంగ‌రాజు చెప్పారు.

మీ పేరులో చివ‌ర రాజు అని ఉండ‌డంతో మీరు రాజులు అనుకుని మీకు నా నాలుగు సినిమాల్లో ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని.. మీరు రాజులు అనుకునే కో డైరెక్ట‌ర్‌గా నేను నాలుగు సినిమాల్లో మీకు ఛాన్సులు క‌ట్ చేశాన‌ని చెప్పిన‌ట్టు రంగ‌రాజు తెలిపారు. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని నాకు తెలుసు కాని.. ఇది నాకు ప్రత్యక్ష అనుభవం. నాలాగే చాలా మంది ఇండస్ట్రీలో ఉండేవారు. ఉన్నారు.. ఉంటారు కూడా అని ఆయ‌న తెలిపారు.ఇక ఇండ‌స్ట్రీ పుట్టిన‌ప్ప‌టి నుంచే కులం ఉంద‌న్న ఆయ‌న ఇండ‌స్ట్రీలో ముందు నుంచి రెడ్డిస్‌, క‌మ్మ‌లు, కాపులు స్టూడియోల య‌జ‌మానులుగా ఉన్నార‌ని.. ఆ త‌ర్వాత రాజులు రావ‌డం స్టార్ట్ చేశార‌ని అన్నారు.

ఇండ‌స్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కులం ప్ర‌ధానం అని.. కులం లేనిదే ఇక్క‌డ అవ‌కాశాలు ఉండ‌వ‌ని.. ప్ర‌స్తుతం కాపు యుగం న‌డుస్తోంద‌ని రంగ‌రాజు చెప్పారు. ఇక మ‌ళ‌యాళంలో కూడా తాను న‌టించాన‌ని.. అయితే అక్క‌డ స‌డెన్‌గా అవ‌కాశాలు రావ‌డం ఆగిపోయింద‌ని.. మోహ‌న్‌లాల్ గారిని డామినేట్ చేసి న‌టించ‌డంతో ఆయ‌నే త‌న‌కు అవ‌కాశాలు రాకుండా చేశార‌ని ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు సిద్ధిక్ చెప్పార‌ని రంగ‌రాజు చెప్పారు. ఇక త‌న‌కు ముందు తాగ‌డం నేర్పింది ర‌జ‌నీకాంత్ అని ఆయ‌న బాంబ్ పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version