రాత్రికి రాత్రి కలగన్నారా?.. టీటీడీ అహంకారాన్ని వదలాలని గోవింద ఆనంద సరస్వతి స్వామి సూచించారు. ‘‘తప్పును ఒప్పుకుంటే పరువు పోతుంది అని తప్పులపై తప్పులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా చైత్ర మాసంలో అంటే మార్చిలో చేస్తారు. టీటీడీ సత్యాన్ని చెప్పకుండా, తప్పుదారి పట్టిస్తోంది. అబద్ధాలపై అబద్దాలు చెపుతున్నారు. జపాలి తీర్థంలో హనుమంతుడు పుట్టాడు అన్నారు. ఇప్పుడు ఆకాశగంగా అంటున్నారు. ఇలా క్షణానికి ఒక మాట టీటీడీ చెప్పటం తగదు. ఇప్పటికి శంకర, మద్వ, రామానుజ పెద్దలను టీటీడీ వెంటనే సంప్రదించాలి. వీళ్ళ డబ్బులు ఉందని నేను అంగీకరించినట్టు ప్రచారం చేశారు. విశాఖ శారదా పీఠం డూప్లికేట్ పీఠం. శంకరాచార్యులు పెట్టిన శృంగేరి, బద్రి, పూరి, ద్వారక ఈ నాలుగుపీఠాలు, కంచి పీఠం మాత్రమే శంకర పీఠాలు. ఉత్తర భారతంలో ఇలాంటి డూప్లికేట్ మాటలు చెపితే వదలరు. తరుముకుంటారు. సీఎం మద్దతు ఉంటే శంకర్ పీఠం అవుతుందా?. జగన్ లాంటి వ్యక్తిని మారు వేషంలో తీసుకు వస్తే సీఎం పోస్ట్ ఇచ్చేస్తారా?. సన్యాసులు రాజనీతిలో రాకూడదు.’’ అని గోవింద ఆనంద సరస్వతి స్వామి అన్నారు.
రాత్రికి రాత్రి కలగన్నారా?.. హనుమంతుడి జయంతిపై సంచలన విమర్శలు
-