గుజరాత్ లాగే, తెలంగాణలోనూ అలాగే గెలుస్తాం – విజయశాంతి

-

గుజరాత్ లాగే, తెలంగాణలోనూ అలాగే గెలుస్తామని విజయశాంతి పేర్కొన్నారు. నిజమైన ప్రజాసేవకులంటే ప్రజలకు ఎంత ఆరాధన ఉంటుందో… అచంచల విశ్వాసానికి అర్థమేంటో గుజరాత్ ప్రజలు తమ తీర్పుతో నేడు చాటి చెప్పారన్నారు.

 

గుజరాత్‌లో 37 సంవత్సరాల రికార్డును చెరిపేసి అత్యధిక స్థానాల్లో గెలుపుతో భారతీయ జనతా పార్టీ నూతన శకానికి నాంది పలికింది. శాసనసభ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ ఇంతటి భారీ స్థాయిలో సీట్లు చేజిక్కించుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషమని చెప్పారు.

 

 

ప్రధానమంత్రి మోదీగారు, అమిత్ షా గారి మార్గదర్శకత్వంలో కాషాయదళం సాధించిన ఈ విజయం భారత చరిత్రలోనే మరో ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 125 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీ కూడా సాధించలేని ఘనత నేడు బీజేపీకి దక్కింది. ఈ విజయ పరంపర భవిష్యత్తులో తెలంగాణ సహా మరిన్ని రాష్ట్రాల్లోనే కాదు, లోక్ సభ ఎన్నికల్లోనూ పునరావృతం కావడం ఖాయమని పేర్కొన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version