జిల్లాల్లో ఉండే ప్రభుత్వ భూములను విక్రయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం 8 జిల్లాల్లో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విక్రయాలకు సంబంధించి.. ఈ 8 జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 17 వరకు వేలం పద్దతిలో భూములను విక్రయించనున్నారు.
దానికి ముందు.. నేడు ఆ 8 జిల్లాల్లో భూముల అమ్మానికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. అదిలాబాద్, వికారాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఈ భూముల వేలం ఉండనుంది. కాగ ఈ 8 జిల్లాల్లో ప్రస్తుతం 1,092 ఓపెన్ ప్లాట్లను భౌతిక వేలం ద్వారా వేలం వేయనున్నారు. ఈ వేలానికి సంబంధించి.. నేడు ఆయా 8 జిల్లాల్లో కలెక్టర్ల ఆద్వర్యంలో ప్రీ బిడ్ సమావేశాలు జరగనున్నాయి. నేటి ప్రి బిడ్ సమావేశాలు ముగిసిన తర్వాత.. వచ్చే నెల 14 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భౌతిక వేలం పద్దతిలో భూములను విక్రయిస్తారు.