వృద్ధుల పెన్షన్ చొరీ.. గ్రామ వాలంటీర్ పరారీ..! ఇది వాలంటీర్ల పరిస్థితి….

-

gram volunteer theft oldage pension and leaves the village
gram volunteer theft oldage pension and leaves the village

గ్రామ వాలంటీర్లను సమర్ధంగా ఉపయోగించుకుంటూ కరోనా కట్టడిలో తనదైన ముద్రను వేసుకుంటున్నాడు సీఎం జగన్, అని దేశ వ్యాప్తంగా అందరూ చర్చించుకుంటే మన వాలంటీర్లు మాత్రం వృద్ధుల దగ్గర వికాలాంగుల దగ్గర డబ్బు కొట్టేసి పరారవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ 63 వేలు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటన పెనుకొండ మండలం కొండపల్లిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా లోని పెనుకొండ మండలం కొండపల్లికి చెందిన ఓ గ్రామ వాలంటీర్ నాయక్ 49 మంది వృద్ధులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్మును దాదాపుగా 63 వేల రూపాయలు తీసుకొని పరారయ్యాడు. ఒకటో తేదీన అందాల్సిన ఫించను తమకు అందలేదని ఆ వృద్ధులు అధికారులకు విషయం తెలియజేయడంతో అధికారులు ఈ విషయం పై ఆరా తీశారు. కాగా నాయక్ అనే వాలంటీర్ ఈ పనికి ఒడగట్టినట్టు తేలింది. దాంతో అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version